![]() |
![]() |

కౌషల్ మందా ఏ పని చేసినా అది సోషల్ మీడియాలో వైరల్ ఐపోతుంది. బిగ్ బాస్ సీజన్ 2 తో ఎవరూ అందుకోలేని క్రేజ్ ని ఆయన సొంతం చేసుకున్నారు. ఈ సీజన్ లో కౌశల్ ఆర్మీ కూడా పుట్టుకొచ్చింది. ఆ తర్వాత సినిమాల్లో నటించేందుకు కొన్ని కథలు కూడా విన్నట్టు కౌషల్ చెప్పాడు. ఐతే తాను మూడు సినిమాల్లో నటించినా పెద్దగా పేరు రాలేదని ఫీలయ్యాడు. కానీ తన ప్రయత్నాలను మాత్రం వదిలిపెట్టలేదు కౌషల్. అలాంటి బిగ్ బాస్ విన్నర్ రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక పాడ్ కాస్ట్ వీడియోని పోస్ట్ చేసి ఒక కథ చెప్పాడు. "అనగనగా ఒక ఊరిలో ఒక ముస్లిం రాజు. అతని పేరు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్.. అతను తన భూమిని ఒక హిందూ దేవాలయ నిర్మాణం కోసం ఇచ్చాడు. ఈ టెంపుల్ డిజాయినర్ గా ఒక బుద్దిస్ట్ పని చేశారు.
ఈ టెంపుల్ కట్టడానికి లీడ్ ఆర్కిటెక్ట్ గా ఒక క్రిస్టియన్ పని చేశారు. ఈ టెంపుల్ కి కాంట్రాక్టర్ గా ఒక పార్శి పని చేశారు. ఈ టెంపుల్ కి లీడ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ఒక సిక్కు పని చేసారు. ఇదంతా కలలో కాదు నిజంగానే జరిగింది. అలా మొట్టమొదటి హిందూ టెంపుల్ అబుదాబిలో నిర్మాణమయ్యింది. రీసెంట్ ప్రధాని మోడీ ఈ టెంపుల్ ని గ్రాండ్ గా లాంఛ్ చేసారు. ఇక ఈ గుడి శాంతికి, సౌబ్రాతృత్వానికి ఒక గుర్తు. ప్రపంచ శాంతి కోసం అందరూ కలిసి కష్టపడి కట్టిన ఈ టెంపుల్ అబుదాబిలోని హిందూ టెంపుల్. మనిషిలో మతాన్ని కాదు మానవత్వాన్ని చూడండి. ఇలా మతాలు గురించి మాట్లాడుకుని కామెంట్లు పెట్టుకునే రోజులు పోయి చాలా రోజులయ్యింది. హ్యాపీగా ప్రశాంతంగా బతకండి" అని హితవు పలికాడు కౌషల్ మందా. ఇక ఆలయం విషయానికి వస్తే 2015లో యూఏఈ రాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, అబు మ్రీఖా దేవాలయం కోసం 13.5 ఎకరాల భూమిని బహుమానంగా ఇచ్చారు. 2018 ఫిబ్రవరిలో ఆలయ నిర్మాణానికి భూమి పూజ జరిగింది. దాదాపు రూ.700 కోట్ల వ్యయంతో ఈ ఆలయాన్ని పింక్ సాండ్‌స్టోన్‌తో 108 అడుగుల ఎత్తుతో దాదాపు వెయ్యేళ్ళ వరకు చెక్కు చెదరకుండా ఉండేలా నిర్మిస్తున్నారు. ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతంలో పురాతన నాగరికతలను తెలుసుకునే రాతి ఆకృతులు కూడా ఏర్పాటు చేశారు. ఈజిప్షియన్, అరబిక్, యూరోపియన్, చైనీస్, ఆఫ్రికన్ చరిత్రలు చెక్కారు. ఇక ఆలయంలో 'రామాయణం' కథలు కూడా కనిపిస్తూ భక్తి పారవశ్యంలో ముంచనున్నాయి.
![]() |
![]() |